Venkateshకు వింత పరిస్థితి.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం!

TBO
By TBO

ప్రస్తుతానికి Andhra Pradeshలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే దేశవ్యాప్తంగా Lok Sabha ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ హీరోలు సైతం ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తనకు మామ వరుసయ్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాలకొండయ్య కోసం పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ సిద్ధార్థ్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక తన బాబాయి Pawan Kalyan కోసం Varun Tej పిఠాపురంలో ప్రచారం చేయబోతున్నారు.

ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే సీనియర్ హీరో Victory Venkatesh కూడా ప్రచారానికి వెళ్లబోతున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన తన బంధువులు ఇద్దరి కోసం ప్రచారం చేయబోతున్నారు. వారు ఇద్దరూ రెండు భిన్నమైన పార్టీలలో ఉన్నారు. వెంకటేష్ వియ్యంకుడు ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రితా మామ అక్కడ నుంచి పోటీ చేస్తూ ఉండడంతో వెంకటేష్ ఒకరోజు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క కైకలూరులో తన భార్యకు సొంత మేనమామ అయిన కామినేని శ్రీనివాస్ కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన కోసం కూడా వెంకటేష్ ప్రచారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ పార్టీల తరపున కాకుండా ఆయన కేవలం అభ్యర్థుల తరఫున మాత్రమే ప్రచారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

Share This Article