రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్.. నెట్టింట ఫోటోలు వైరల్

TBO
By TBO

హీరోయిన్ అమలా పాల్ రెండో పెళ్లి ఘనంగా జరిగింది. జగత్ దేశాయ్ తో ఆమె వివాహం.. కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరిగింది. ఈ వేడుకు ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.

పెళ్లికి సంబంధించిన ఫోటోలను జగత్‌ దేశాయ్‌ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమల లెహంగా ధరించగా, జగత్ షేర్వాణీలో అందంగా కనిపించాడు. వీరికి సినీ సెలబ్రేటీలతో పాటుగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమలా పాల్, జగత్ దేశాయ్ లు గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఈ క్రమంలో అమలా పాల్ పుట్టిన రోజు అక్టోబరు 26న జగత్‌ ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. దీంతో త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ చర్చ సాగింది. ఇప్పుడు పెళ్లి ఫొటోలతో జగత్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది ఈ జంట.


ఇక అమలాపాల్ 2014లో దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ని వివాహం చేసుకుంది. పరస్పర అంగీకారంతో 2017లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత 2018 లో తన స్నేహితుడు సింగర్ భవీందర్ సింగ్‌ను అమలాపాల్ పెళ్లాడినట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి ఓ షూట్‌లో భాగమని చెప్పి పెళ్లి వార్తలను కొట్టేసింది అమలాపాల్.

Share This Article