
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్య అనేది కేవలం డిగ్రీ పొందడం మాత్రమే కాదు… అది ఒక విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మలిచే కీలక నిర్ణయం. సరైన కోర్సు, సరైన కాలేజీ ఎంపిక చేయలేక ఎంతో మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్న పరిస్థితుల్లో… ఒక విశ్వసనీయ మార్గదర్శకుడిగా డిజిటల్ గ్లోబస్ భారత్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న టాప్ కాలేజీలు, యూనివర్సిటీలతో విద్యార్థులను అనుసంధానిస్తూ, వారి కెరియర్‌కు సరైన దారి చూపడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.

విద్యార్థుల గందరగోళానికి సమాధానం
నేటి రోజుల్లో కోర్సుల సంఖ్య పెరిగింది… కాలేజీలు పెరిగాయి… కానీ సరైన సమాచారం, సరైన మార్గనిర్దేశం లేకపోవడంతో విద్యార్థులు తప్పు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా పెరిగింది. ఒక చిన్న తప్పు నిర్ణయం జీవితాన్నే దారి తప్పించగలదన్న వాస్తవాన్ని గుర్తించిన డిజిటల్ గ్లోబస్, విద్యార్థి భవిష్యత్తును కేంద్రంగా పెట్టుకుని పనిచేస్తోంది.

కాలేజీ కాదు… ముందు విద్యార్థే ముఖ్యం
డిజిటల్ గ్లోబస్ ప్రత్యేకత ఏంటంటే… ఇక్కడ నేరుగా కాలేజీలు లేదా కోర్సులు సిఫార్సు చేయరు. ముందుగా విద్యార్థిని పూర్తిగా అర్థం చేసుకుంటారు. విద్యార్థి ఆసక్తులు, బలాలు, సామర్థ్యాలు, భవిష్యత్తులో అతను/ఆమె చేరాలనుకునే లక్ష్యాలు ఇవన్నీ విశ్లేషించిన తర్వాత, ఐదేళ్ల తర్వాత విద్యార్థి ఎక్కడ ఉండాలన్న దానిపై స్పష్టమైన కెరియర్ రోడ్‌మ్యాప్ రూపొందిస్తారు. నమ్మకం, నైతిక విలువలు (Ethics) ఈ సంస్థకు పునాదులు.

దేశవ్యాప్తంగా టాప్ కాలేజీలతో అనుసంధానం
డిజిటల్ గ్లోబస్ భారత్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, భారతదేశం అంతటా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్, అటానమస్ యూనివర్సిటీలతో విద్యార్థులను కలుపుతోంది. ఇక్కడ అందించే ముఖ్యమైన కోర్సులు:
-
B.Tech – టెక్నాలజీ రంగంలో ఎదగాలనుకునే వారికి
-
MBBS – వైద్య సేవల్లో జీవితాన్ని అంకితం చేయాలనుకునే వారికి
-
MBA – నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలనుకునే వారికి
-
B.Sc, B.Com, Arts, Science, Commerce & ఇతర ప్రొఫెషనల్ కోర్సులు

అడ్మిషన్ అంటే ఒక్కరోజు ప్రక్రియ కాదు
డిజిటల్ గ్లోబస్‌లో అడ్మిషన్ అనేది ఒక రోజు పని కాదు… అది ఒక పూర్తి ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రతి దశలో విద్యార్థికి అండగా నిలుస్తారు.
-
సరైన కాలేజీ ఎంపిక
-
అప్లికేషన్ & డాక్యుమెంటేషన్ సపోర్ట్
-
అడ్మిషన్ కన్ఫర్మేషన్
-
కాలేజీలో చేరిన తర్వాత కూడా గైడెన్స్ కొనసాగింపు
అంటే… జాయిన్ అయ్యే వరకు మాత్రమే కాదు, జాయిన్ అయిన తర్వాత కూడా విద్యార్థి ప్రయాణంలో భాగస్వామిగా ఉంటుంది ఈ సంస్థ.

‘Your Career. Our Commitment.’ – మాటల్లో కాదు, పనిలో
“Your Career. Our Commitment.” అనే నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, ప్రతి విద్యార్థి భవిష్యత్తుపై నిజమైన బాధ్యతతో పనిచేస్తోంది డిజిటల్ గ్లోబస్ భారత్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. విద్యతో జీవితాన్ని నిర్మించుకోవాలనుకునే ప్రతి విద్యార్థికి… సరైన దారి చూపే విశ్వసనీయ భాగస్వామిగా ఈ సంస్థ ముందుకు సాగుతోంది.


