లవ్ స్టొరీ లొకేషన్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్

*లవ్ స్టొరీ లొకేషన్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్*

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్”లవ్ స్టొరీ” లొకేషన్ లో యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగాయి. హీరో నాగ చైతన్య, హీరోయిన్
సాయి పల్లవి , నిర్మాత సునీల్ నారంగ్ లతో పాటు భరత నారంగ్,డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా తదితరులు దర్శకుడు శేఖర్ కమ్ముల కు
శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో ‘ లవ్ స్టొరీ’ షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ ల్లో ఉన్న ఈ మ్యూజికల్
లవ్ స్టొరీ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి కి విడుదల చేసిన ‘లవ్ స్టొరీ’ ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్
వచ్చింది.శేఖర్ కమ్ముల , చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ క్రేజ్ కి ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది.

ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఆర్ట్:రాజీవ్ నాయర్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్,
సహా నిర్మాత : భాస్కర్ కటకంశెట్టి, పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా,
డిజిటల్ మార్కెటింగ్: నీహారిక గాజుల
మ్యూజిక్ : పవన్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు
రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల

online dating pros cons google chat members into sex chat