‘శ్యామ్ సింగ రాయ్’ వచ్చేశాడు.. అదరగొడుతున్న టీజర్

అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ..’శ్యామ్ సింగ రాయ్‌’ అంటూ టీజర్‌తో వచ్చేశాడు నాని. ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్‌’. తాజాగా ఈ సినిమా టీజర్‌ వచ్చి ఆకట్టుకుంటోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు.

డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్‌’ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలతో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే మేకర్స్ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సినిమాకు హైలెట్‌గా నిలవబోతోందని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మధ్యకాలంలో నానికి సాలీడ్ హిట్ దక్కలేదు. దీంతో ‘శ్యామ్ సింగ రాయ్‌’ తో నాని హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి..