సీటీమార్ మూవీ రివ్యూ

చిత్రం: సీటీమార్‌; న‌టీన‌టులు: గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, త‌రుణ్ అరోరా, అప్సర రాణి (ప్రత్యేక‌గీతం) త‌దిత‌రులుసంగీతం: మ‌ణిశర్మనిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరికథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌ నందిబ్యాన‌ర్‌: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్విడుద‌ల‌: 10-09-2021 ‘మ‌హిళా సాధికార‌త‌కు మ‌నం ఏవో గొప్ప ప‌నులు చేయ‌న‌క్కర్లేదు. మ‌న చుట్టూ ఉన్న ఆడ‌పిల్లల‌కు అండ‌గా నిల‌బ‌డితే చాలు.. మంచి స‌మాజం ఏర్పడుతుంది’ అనే ఓ పాయింట్‌ను తీసుకుని గోపీచంద్ హీరోగా ద‌ర్శకుడు సంప‌త్ నంది తెర‌కెక్కించిన చిత్రం ‘సీటీమార్‌’. అన్ని కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నరగా ల్యాబ్‌కే పరిమితమైంది. సెకండ్ వేవ్ త‌ర్వాత ఇప్పుడిప్పుడే థియేట‌ర్స్‌ సందడిగా మారుతుండటంతో వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సినిమాను నిర్మాతలు రిలీజ్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘సీటీమార్’ ప్రేక్షకుల‌ను ఏ మేర‌కు ఆట్టుకుంది?.. నిజంగానే ఆడియెన్స్‌తో సీటీలు…

Review Overview

Direction
Acting
Production
Music
Overall

2.5

Summary : రొటీన్ ఫార్ములా యాక్షన్ ఎంటర్‌టైనర్

User Rating: Be the first one !
49

చిత్రం: సీటీమార్‌; న‌టీన‌టులు: గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, త‌రుణ్ అరోరా, అప్సర రాణి (ప్రత్యేక‌గీతం) త‌దిత‌రులు
సంగీతం: మ‌ణిశర్మ
నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌ నంది
బ్యాన‌ర్‌: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
విడుద‌ల‌: 10-09-2021

‘మ‌హిళా సాధికార‌త‌కు మ‌నం ఏవో గొప్ప ప‌నులు చేయ‌న‌క్కర్లేదు. మ‌న చుట్టూ ఉన్న ఆడ‌పిల్లల‌కు అండ‌గా నిల‌బ‌డితే చాలు.. మంచి స‌మాజం ఏర్పడుతుంది’ అనే ఓ పాయింట్‌ను తీసుకుని గోపీచంద్ హీరోగా ద‌ర్శకుడు సంప‌త్ నంది తెర‌కెక్కించిన చిత్రం ‘సీటీమార్‌’. అన్ని కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నరగా ల్యాబ్‌కే పరిమితమైంది. సెకండ్ వేవ్ త‌ర్వాత ఇప్పుడిప్పుడే థియేట‌ర్స్‌ సందడిగా మారుతుండటంతో వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సినిమాను నిర్మాతలు రిలీజ్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘సీటీమార్’ ప్రేక్షకుల‌ను ఏ మేర‌కు ఆట్టుకుంది?.. నిజంగానే ఆడియెన్స్‌తో సీటీలు వేయించుకుంటోందా? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం..

కథేంటంటే:

కార్తీక్ (గోపీచంద్‌) ఆంధ్రా మ‌హిళ‌ల క‌బ‌డ్డీ జ‌ట్టు కోచ్‌. స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. క‌డియంలో త‌న తండ్రి స్థాపించిన రామ‌కృష్ణ మెమోరియ‌ల్ స్కూల్ ద్వారా ఆడపిల్లలకు కబడ్డీలో శిక్షణ ఇస్తుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ స్కూల్ మూతపడే పరిస్థితి తలెత్తుతుంది. దీంతో ఎలాగైనా తాను తీర్చిదిద్దిన కబ‌డ్డీ జ‌ట్టుని జాతీయ స్థాయి పోటీల్లో గెలిపించి, ఆ జ‌ట్టు ద్వారా ఊళ్లోని స్కూల్ స‌మస్య వెలుగులోకి తీసుకురావాల‌ని అనుకుంటాడు. ఆ ప్రయ‌త్నంలో ఉన్న కార్తీక్‌కి ఊళ్లోనే ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? దిల్లీలో పోలీస్ అధికారిగా ఉద్యోగం చేస్తూనే మాఫియాని న‌డిపిస్తున్న మాకన్‌సింగ్ (త‌రుణ్ అరోరా)తో కార్తీక్‌కి ఎలా వైరం ఏర్పడింది? త‌న జ‌ట్టు జాతీయ స్థాయి పోటీల్లో విజేత‌గా నిలిచిందా? కార్తీక్ ఆశ‌యం నెర‌వేరిందా? తెలంగాణ క‌బ‌డ్డీ జ‌ట్టు కోచ్ జ్వాలారెడ్డి (త‌మ‌న్నా), కార్తీక్‌కి మధ్య సంబంధం ఏంటన్నది మిగతా కథ.

తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు రావ‌డం చాలా త‌క్కువ‌. వ‌చ్చినా క‌బ‌డ్డీపై రెండు, మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ద‌ర్శకుడు సంప‌త్ నంది… క‌బ‌డ్డీ అనే స్పోర్ట్స్‌ను బేస్ చేసుకుని ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘సీటీమార్‌’ సినిమాను తెర‌కెక్కించాడు. అమ్మాయిల అన్ని రంగాల్లో ముంద‌డుగు వేయాలి. ముఖ్యంగా స్పోర్ట్స్ విష‌యంలో అనే విష‌యాన్ని ఒక ప‌క్క ట‌చ్ చేస్తూనే క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మేళ‌వించాడు. గోపీచంద్‌కు ఉన్న యాక్షన్ హీరో అనే ఓ ఇమేజ్‌‌కు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఫైట్స్‌, పాట‌ల‌ను మిక్స్ చేసి సినిమాను రూపొందించాడు.

ఎలా ఉందంటే..

ప్రథమార్ధమంతా గోదావ‌రి గ‌ట్లు, ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగుతుంది. కొన్ని స‌ర‌దా స‌న్నివేశాలతోపాటు… ఊళ్లో అమ్మాయిల్ని ఆట‌ల‌వైపు పంపించే విష‌యంలో త‌ల్లిదండ్రుల్లో ఉండే అపోహ‌లు, ప‌ల్లెటూరి రాజ‌కీయాలు కీల‌కం. సెకండాఫ్‌లో పూర్తిగా దిల్లీ, క‌బ‌డ్డీ, మాక‌న్ సింగ్ మాఫియా నేప‌థ్యంలో సాగుతుంది. తొలి స‌గ‌భాగంలో కడియం బ్రదర్‌పాత్రలో రావు ర‌మేష్ చేసే రాజ‌కీయం ఆక‌ట్టుకుంటుంది. గోదావ‌రి యాస మాట్లాడుతూ ఆయ‌న చేసే సంద‌డి న‌వ్విస్తుంది. అమ్మాయిల త‌ల్లిదండ్రుల్ని ఒప్పించి జాతీయ స్థాయి పోటీల కోసం దిల్లీ వెళ్లిన కార్తీక్‌కి అక్కడ ఎదురైన సవాళ్లు సెకండాఫ్‌ను నిలబెట్టాయి. అయితే జాతీయ స్థాయి పోటీల‌కి వెళ్లిన ఓ రాష్ట్ర జ‌ట్టు కిడ్నాప్‌కి గురైతే, అది బ‌య‌టికి పొక్కకుండా ఉండ‌టం, ఆ జ‌ట్టు కోసం కోచ్ ఒక్కడే పోరాడ‌టం అనేది లాజిక్‌కి దూరంగా అనిపిస్తుంది. మాక‌న్ సింగ్‌, కార్తీక్‌కి మ‌ధ్య న‌డిచే ఆ ఎపిసోడ్ చప్పగా సాగడంతో ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారు.

అయితే హీరో త‌న టీమ్‌ను క‌నుక్కుని విడిపించుకోవ‌డం.. విల‌న్‌ను చంపేయ‌డం.. అదే స‌మ‌యంలో అస‌లు గెలుస్తారో లేదో అనుకున్న టీమ్ గెల‌వ‌డం వంటి స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. సినిమాలో భారీత‌నం క‌న‌ప‌డింది. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రఫీ స‌న్నివేశాల‌కు మ‌రింత బ‌లాన్నిచ్చాయి. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన పాట‌ల్లో టైటిల్ ట్రాక్ బావుంది. అప్సర రాణి స్పెష‌ల్ సాంగ్ ఆకట్టుకుంది. అయితే హీరో, హీరోయిన్ మధ్య సరైన లవ్ ట్రాక్ లేకపోవడం నిరాశ పరుస్తుంది.

ఎవరెలా చేశారంటే..

గోపీచంద్ అంతా తానై సినిమాను త‌న భుజాల‌పై మోశాడు. త‌న పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. త‌మ‌న్నా సినిమా ప్రారంభ‌మైన 40 నిమిషాల‌కు ఎంట్రీ ఇస్తుంది. ఆమెది గ్లామ‌ర్ రోల్ కాదు.. కానీ జ్వాలారెడ్డి సాంగ్‌లో కాస్త గ్లామ‌ర్‌గా క‌నిపించి కనువిందు చేసిది. ఆమె పాత్ర చెప్పుకునేంతగా లేదు. ఫ‌స్టాఫ్‌లో రావు ర‌మేశ్ త‌న డైలాగ్స్ విల‌నిజాన్ని పండిస్తే.. సెకండాఫ్‌లో త‌రుణ్ అరోరా విల‌న్‌గా ఆక‌ట్టుకున్నాడు. మిగతా పాత్రల గురించి అంతగా చెప్పుకోనవసరం లేదు. స్పోర్ట్స్‌, యాక్షన్ మిక్స్ అయిన‌ క‌మ‌ర్షియ‌ల్ సినిమా చూడాల‌నుకునే ప్రేక్షకులకు ‘సీటీమార్‌’ తప్పక నచ్చుతుంది.