టక్‌ జగదీష్‌ రివ్యూ

చిత్రం: టక్‌ జగదీష్‌; నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌, జగపతిబాబు, డానియల్‌ బాలాజీ, నరేశ్‌, రావు రమేశ్, ప్రవీణ్‌ తదితరులు సంగీతం: తమన్‌, గోపీ సుందర్‌(నేపథ్య సంగీతం) బ్యానర్‌: షైన్‌ స్క్రీన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాత: సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తనదైన సహజ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు నాని. తొలి సినిమా నుంచే వైవిధ్య కథలు, పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారాయన. కరోనా కారణంగా గతేడాది ఆయన నటించిన ‘వి’ ఓటీటీలో సందడి చేసింది. పరిస్థితులు ఇంకా మెరుగుపడక పోవడంతో తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన ‘టక్‌ జగదీష్‌’ కూడా అదే బాటలో పయనించింది. ‘నిన్నుకోరి’ వంటి సూపర్‌హిట్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? నాని తన నటనతో మరోసారి మెప్పించారా?.. లేదా?…

Review Overview

Direction
Acting
Production
Music
Overall

2.5

Summary : రొటీన్ ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామా

User Rating: Be the first one !
51

చిత్రం: టక్‌ జగదీష్‌; నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌, జగపతిబాబు, డానియల్‌ బాలాజీ, నరేశ్‌, రావు రమేశ్, ప్రవీణ్‌ తదితరులు

సంగీతం: తమన్‌, గోపీ సుందర్‌(నేపథ్య సంగీతం)

బ్యానర్‌: షైన్‌ స్క్రీన్‌ ప్రొడక్షన్స్‌

నిర్మాత: సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

తనదైన సహజ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు నాని. తొలి సినిమా నుంచే వైవిధ్య కథలు, పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారాయన. కరోనా కారణంగా గతేడాది ఆయన నటించిన ‘వి’ ఓటీటీలో సందడి చేసింది. పరిస్థితులు ఇంకా మెరుగుపడక పోవడంతో తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన ‘టక్‌ జగదీష్‌’ కూడా అదే బాటలో పయనించింది. ‘నిన్నుకోరి’ వంటి సూపర్‌హిట్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? నాని తన నటనతో మరోసారి మెప్పించారా?.. లేదా? తెలియాలంటే ముందు కథలోకి వెళ్దాం..

కథేంటంటే..

భూదేవీపురం గ్రామంలో ఆదికేశ‌వ నాయుడు(నాజ‌ర్‌) పెద్దమ‌నిషి. తన కుటుంబంతో పాటు ఊరిలో అంద‌రూ బావుండాల‌ని కోరుకుంటాడు. అదికేశవ నాయుడికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బోసు(జ‌గ‌ప‌తిబాబు).. చిన్న కొడుకు జ‌గ‌దీష్ నాయుడు(నాని). జగదీష్ ఎప్పుడూ టక్ చేసుకునే ఉంటాడు. దీంతో అందరూ అతడికి టక్ జగదీష్ అని పిలుస్తుంటారు. త‌న ట‌క్‌ను ఎవ‌రైనా లాగితే వారితో గొడ‌వ ప‌డుతుంటాడు. బోసు ఊళ్లో వ్యవ‌హారాలు చూసుకుంటుంటే, ట‌క్ జ‌గ‌దీష్ సిటీలో ఉంటూ అప్పుడ‌ప్పుడూ ఊరికి వ‌చ్చి వెళుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వీరేంద్ర నాయుడు(డానియ‌ల్ బాలాజీ) తండ్రి ఊర్లో గొడ‌వ‌లు పెడుతూ ఉంటాడు. ఓసారి అనుకోకుండా వీరేంద్ర నాయుడు తండ్రిని ఓ వ్యక్తి పంచాయ‌తీలోనే చంపేస్తాడు. దాంతో వీరేంద్ర నాయుడు ఆది కేశ‌వులు, అత‌ని కుటుంబంపై ప‌గ పెంచుకుంటాడు. అనుకోకుండా ఓ రోజు ఆది కేశ‌వ‌నాయుడు గుండెపోటుతో చ‌నిపోతాడు. అప్పుడు బోసు త‌న అసలు రంగు చూపిస్తాడు. వీరేంద్రతో చేతులు క‌లిపి.. ఎమ్మార్వో సాయంతో ఆస్థిని త‌న పేరుపై ఉండేలా చూసుకుంటాడు. అంతే కాదు.. త‌న ఇంటి ఆడ‌ప‌డుచుల‌కు ఆస్థి ఇవ్వన‌ని అంద‌రినీ ఇంటి నుంచి గెంటేస్తాడు. అస‌లు బోసు ఉన్నట్లుండి అలా ఎందుకు మారిపోయాడు? నిజం తెలుసుకున్న జ‌గ‌దీష్ అన్నను ఎలా దారిలోకి తెచ్చుకుంటాడు? వీరేంద్రతో చేతులు క‌లిపిన బోసుకి ఎలాంటి పరిస్థితి ఎదుర‌వుతుంది? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

గ్రామంలో భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు.. తన కుటుంబం కోసం చిన్న కొడుకైన హీరో వాటిని ఎలా పరిష్కరించాడన్న కథతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. మంచి పాటలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌ పండినవేళ ఆయా సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. విక్టరీ వెంకటేశ్‌ ఇలాంటి సబ్జెక్ట్‌తో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్‌లు అందుకున్నారు. ‘టక్‌ జగదీష్‌’ విషయంలో దర్శకుడు శివ నిర్వాణ కథానాయకుడి పాత్ర మినహా కొత్త కథ జోలికి పోలేదు. భూదేవిపురంలో జరిగే గొడవలతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఆయా సన్నివేశాలన్నీ గతంలో మనం చాలా సినిమాల్లో చూశాం. టక్‌ జగదీష్‌ రాకతో కథ మలుపు తిరుగుతుందనుకుంటే ఫ్యామిలీ డ్రామాతో సన్నివేశాలు నడిపించాడు. కథనం కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. ఆది శేషులునాయుడు చనిపోయే వరకూ ఫక్తు ఫ్యామిలీ డ్రామా తెరపై కనిపిస్తూ ఉంటుంది.

ఆ త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబు పాత్ర.. విల‌న్‌తో చేతులు క‌ల‌ప‌డం.. ఫ్యామిలీలో గొడ‌వ‌లు మొద‌లు ఇలా క‌థ నెక్ట్స్ స్టెప్ తీసుకుంటుంది. ఇక నాని.. పాత్రకు సంబంధించిన ఎమ్మార్వో అనే అస‌లు బ్యాక్ డ్రాప్‌ను బ‌య‌ట‌ పెట్టడంతో ఇంట‌ర్వెల్‌ను పూర్తి చేశారు. ఇక సెకండాఫ్‌లో ఎమ్మార్వోగా ఊల్లోకి రాగానే అన్న‌కు ఎదురు తిర‌గ‌డం.. విల‌న్ భ‌ర‌తం ప‌ట్ట‌డం వంటి స‌న్నివేశాలతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయ‌త్నం చేశారు. ఊరు, కుటుంబం బావుండాల‌నుకున్న తండ్రి మాట‌ను నిల‌బెట్టడానికి అందరితో చెడ్డవాడిన‌నిపించుకున్న హీరో..చివ‌ర‌కు త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డంతో సినిమా ముగుస్తుంది. ఇందులోని చాలా సెంటిమెంట్ సన్నివేశాలు చూస్తుంటే కార్తి నటించిన ‘చినబాబు’ గుర్తుస్తొంటుంది.

ఎవరెలా చేశారంటే..

ఎలాంటి పాత్ర అయినా తనదైన నటన, హావభావాలతో ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయగలనని ‘టక్‌ జగదీష్‌’తో నాని మరోసారి నిరూపించాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఆయనకు తిరుగులేదు. యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టాడు. అయితే, నాని నుంచి కోరుకునే చిలిపి కామెడీ ఇందులో లేదు. దర్శకుడు దాన్ని కూడా దృష్టి పెట్టుకుని ఉంటే ఈ సినిమా మరోస్థాయిలో ఉంటుంది. రీతూవర్మ అందంగా కనిపిస్తూ తన పాత్రకు న్యాయం చేసింది. నాని-రీతూల కెమిస్ట్రీ తెరపై బాగుంది. జగపతిబాబు సీనియార్టీ బోసు పాత్రకు బాగా పనికొచ్చింది. ఆ పాత్రలో ఉన్న రెండు రకాల వేరియేషన్స్‌ చక్కగా పలికించారు. ఐశ్వర్య రాజేశ్‌, డానియల్‌ బాలాజీ, నాజర్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.