రివ్యూ: అఖండ… బాలయ్య ఫ్యాన్స్‌కి పూనకాలే!

చిత్రం: అఖండన‌టీన‌టులు: బాల‌కృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ, సుబ్బరాజు, అవినాష్‌, సాయికుమార్‌, శ్రవ‌ణ్‌, ప్రభాక‌ర్, త‌దిత‌రులు,మ్యూజిక్: త‌మ‌న్నిర్మాణ సంస్థ: ద్వారక క్రియేష‌న్స్‌నిర్మాత‌: మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డిద‌ర్శక‌త్వం: బోయ‌పాటి శ్రీను;విడుద‌ల: 2 డిసెంబ‌ర్ 2021 నట సింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి ఈ కాంబినేషన్‌ సిద్ధం కాగా… టీజర్లు, ట్రైలర్లతోనే మరో విజయం భారీ హైప్ సాధించాయి. దాంతో అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బోయపాటికి, బాలకృష్ణకు హ్యాట్రిక్ లభించిందా.. ‘అఖండ‌’ అవ‌తారంలో బాల‌కృష్ణ గ‌ర్జన ఎలా ఉంది? అని తెలుసుకునే ముందు క‌థలోకి వెళ్దాం… గ‌జేంద్ర సాహు అనే పేరు మోసిన టెర్రరిస్ట్ పోలీసుల ఎన్‌కౌంట‌ర్ నుంచి త‌ప్పించుకుని మ‌హారుద్ర పీఠంను చేరుకుంటాడు. త‌న‌ను ఇబ్బంది పెట్టిన ఈ వ్యవస్థపై ప్రతీకారం తీర్చుకోవాల‌ని పీఠాధిప‌తిని చంపి…

Review Overview

Acting
Direction
Production
Music
Overall

Summary : బాలయ్య ‘అఖండ’ విశ్వరూపం

User Rating: 3.48 ( 1 votes)
67

చిత్రం: అఖండ
న‌టీన‌టులు: బాల‌కృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ, సుబ్బరాజు, అవినాష్‌, సాయికుమార్‌, శ్రవ‌ణ్‌, ప్రభాక‌ర్, త‌దిత‌రులు,
మ్యూజిక్: త‌మ‌న్
నిర్మాణ సంస్థ: ద్వారక క్రియేష‌న్స్‌
నిర్మాత‌: మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి
ద‌ర్శక‌త్వం: బోయ‌పాటి శ్రీను;
విడుద‌ల: 2 డిసెంబ‌ర్ 2021

నట సింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి ఈ కాంబినేషన్‌ సిద్ధం కాగా… టీజర్లు, ట్రైలర్లతోనే మరో విజయం భారీ హైప్ సాధించాయి. దాంతో అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బోయపాటికి, బాలకృష్ణకు హ్యాట్రిక్ లభించిందా.. ‘అఖండ‌’ అవ‌తారంలో బాల‌కృష్ణ గ‌ర్జన ఎలా ఉంది? అని తెలుసుకునే ముందు క‌థలోకి వెళ్దాం…

గ‌జేంద్ర సాహు అనే పేరు మోసిన టెర్రరిస్ట్ పోలీసుల ఎన్‌కౌంట‌ర్ నుంచి త‌ప్పించుకుని మ‌హారుద్ర పీఠంను చేరుకుంటాడు. త‌న‌ను ఇబ్బంది పెట్టిన ఈ వ్యవస్థపై ప్రతీకారం తీర్చుకోవాల‌ని పీఠాధిప‌తిని చంపి తానే పీఠాధిప‌తిగా మారుతాడు. అదే స‌మ‌యంలో అనంత‌పురంలో రామచంద్రరాజు అనే వ్యక్తికి మ‌గ క‌వ‌ల‌లు పుడ‌తారు. వారిలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంటే, మ‌రో బిడ్డ ఉలుకు ప‌లుకు లేకుండా ఉంటాడు. అదే స‌మ‌యంలో వారింటిలోకి అడుగు పెట్టిన అఘోరా (జ‌గ‌ప‌తిబాబు) చ‌నిపోయిన బిడ్డను తీసుకెళ్లిపోతాడు. చ‌నిపోయిన బిడ్డ కాశీ విశ్వనాథుడి స‌న్నిధానానికి చేరుకుంటాడు. ప‌ర‌మేశ్వరుడి దయ‌తో ఆ బిడ్డ ఊపిరి పోసుకుంటుంది. కొన్నేళ్ల త‌ర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దవార‌వుతారు. అనంత‌పురంలో పెరిగిన బిడ్డ ముర‌ళీకృష్ణ (నంద‌మూరి బాల‌కృష్ణ) ఆ ప్రాంతంలో ఫ్యా్క్షనిజం రూపుమాప‌డానికి ప్రయ‌త్నిస్తుంటాడు. ఆ ప్రాంతంలో స్కూల్స్‌, హాస్పిటల్స్ క‌ట్టించి ప్రజ‌ల‌కు సేవ చేస్తుంటాడు.

ముర‌ళీ కృష్ణ చేసే మంచి ప‌నులు చూసి ఆ జిల్లాకు వ‌చ్చిన కలెక్టర్ శ‌రణ్య (ప్రగ్యా జైశ్వాల్‌) అత‌న్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. మ‌రో వైపు.. అదే ప్రాంతంలో కాప‌ర్ మైనింగ్ వ్యాపారం చేసే వ‌ర‌దరాజులు (శ్రీకాంత్‌)కి, త‌న మైన్‌లో యురేనియం ఉంద‌ని తెలియ‌డంతో దాన్ని వెలికి తీసే ప‌నుల్లో బిజీగా ఉంటాడు. అక్కడ వ‌చ్చే వ్యర్థాల‌ను భూమిలోకి పంపేయ‌డంతో చిన్న పిల్లలు చనిపోతారు. విష‌యం తెలుసుకున్న ముర‌ళీ కృష్ణ ..వ‌ర‌దరాజుల‌కి ఎదురెళ‌తాడు. అప్పుడు ఓ ప్లానింగ్ ప్రకారం జ‌రిగిన ప‌రిస్థితుల న‌డుమ ముర‌ళీ కృష్ణ క‌ట్టించిన హాస్పిట‌ల్‌లో బాంబ్ పేలి మినిస్టర్ చ‌నిపోతాడు. దాంతో ముర‌ళీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో ఒంటరైన శ‌రణ్యను చంప‌డానికి వ‌ర‌ద‌రాజులు ప్రయ‌త్నిస్తాడు. అప్పుడే అఖండ రంగ ప్రవేశం చేస్తాడు. అస‌లు అఖండ ఎవ‌రు? వ‌ర‌ద‌రాజుకి ఎందుకు ఎదురెళతాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

బాల‌కృష్ణ-బోయ‌పాటి కల‌యిక నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో ఆ అంశాల‌న్నీ ప‌క్కాగా కుదిరిన సినిమా ఇది. శివుడు అలియాస్ అఖండగానూ.. ముర‌ళీకృష్ణ పాత్రలోనూ బాల‌కృష్ణ త‌నదైన శైలిలో ఒదిగిపోయారు. అఖండ పాత్రలోనైతే ఆయ‌న రౌద్ర ప్రద‌ర్శన తీరు విశ్వరూపమే. ఇందులోని ఒక పాత్ర ప్రళ‌యాన్ని గుర్తు చేస్తే, మ‌రో పాత్ర ప్రకృతిలా అందంగా తెర‌పై క‌నిపిస్తుంది. కథానాయ‌కుడి ప‌రిచ‌య స‌న్నివేశాలు మొదలుకొని చివ‌రి వ‌ర‌కు ప్రతీ స‌న్నివేశం కూడా బాల‌కృష్ణ మాస్ ఇమేజ్, బోయ‌పాటి మార్క్ థీమ్ మేర‌కు సాగుతుంది. అభిమానుల‌తో ఈల‌లు కొట్టించే ఎలివేష‌న్ స‌న్నివేశాలు అడుగ‌డుగునా ఉంటాయి.

ప్రథ‌మార్థం ముర‌ళీకృష్ణ – శ‌ర‌ణ్యల మ‌ధ్య ప్రేమాయ‌ణం, పీఠాధీశుడిని చంపి శ‌క్తి స్వరూపానంద స్వామిగా అవ‌త‌రించి మైనింగ్ మాఫియాతో చేయించే ఆకృత్యాల నేపథ్యంలో సాగుతుంది. రైతుగా, ఆ ప్రాంత ప్రజ‌ల మేలుని కోరే వ్యక్తిగా ముర‌ళీకృష్ణ పాత్రలో బాల‌కృష్ణ ఆక‌ట్టుకుంటారు. ప్రకృతి గురించి ఆయ‌న చెప్పే సంభాష‌ణ‌లు అల‌రిస్తాయి. జై బాల‌య్య పాట కిక్కెక్కిస్తే, అడిగా అడిగా.. పాట‌లో బాల‌కృష్ణ – ప్రగ్యా జోడీ చూడ‌ముచ్చట‌గా క‌నిపిస్తుంది. ఒకే పాట‌లోనే నాయ‌కానాయిక‌ల‌కి పెళ్లి కావ‌డం, పాప పుట్టడం, ఆ పాప ప్రోద్భలంతోనే రెండో పాత్ర అఖండని ప‌రిచ‌యం చేసిన తీరు బాగుంది. ద్వితీయార్థానికి ముందు అఖండ పాత్ర ఆగ‌మ‌నం జ‌రుగుతుంది. సినిమా అక్కడిదాకా ఒకెత్తు.. అఖండ పాత్ర ప్రవేశం త‌ర్వాత మ‌రో ఎత్తు. ప్రకృతి, చిన్నారులు, ముక్కంటి జోలికి వ‌చ్చిన ప్రతినాయ‌కుడిని అఖండ ఎలా అంతం చేశాడ‌నేది ద్వితీయార్థంలో కీల‌కం. బాల‌కృష్ణ చేసిన రెండో పాత్రని అఘోరాగా చూపించ‌డం సినిమాకి ప్లస్సయ్యింది. అఖండ శివుడి అంశ‌తోనే పుట్టాడ‌నే సంకేతాలు క‌నిపిస్తాయి కాబ‌ట్టి ఆ పాత్రలో బాల‌కృష్ణ ఎన్ని విన్యాసాలు చేసినా న‌మ్మేలా ఉంటాయి. ఆయ‌న చెప్పే ప్రతీ సంభాష‌ణ ఓ పోరాటంలా, ప్రతీ పోరాటం ఓ క్లైమాక్స్ స‌న్నివేశాన్ని తల‌పించేలా ఉంటుంది.

బాల‌కృష్ణని బోయ‌పాటి శ‌క్తిమంతంగా చూపిస్తార‌ని తెలుసు.. కానీ ఇందులో డోస్ మ‌రింత పెంచారు. ఇందులో క‌థ కంటే కూడా పాత్రల్ని మ‌లిచిన తీరే ఆక‌ట్టుకుంటుంది. దేవుడు, విజ్ఞానానికీ మ‌ధ్య సంబంధం గురించి, హిందుత్వం గురించీ, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని.. శివుడు మామూలు మ‌నిషి కాదంటూ బాల‌కృష్ణ చెప్పే సంభాష‌ణ‌లు సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. చిన్నారులు, దేవాల‌యాలు, దేవుడు, ప్రకృతి త‌దిత‌ర అంశాల నేప‌థ్యంలో అక్కడ‌క్కడా భావోద్వేగాలు పండాయి. మొత్తంగా మాస్ ప్రేక్షకుల్ని ఉత్సాహంగా థియేట‌ర్లకి ర‌ప్పించే ప‌క్కా పైసా వ‌సూల్ చిత్రమిది.

బాల‌కృష్ణ వ‌న్ మేన్ షోలా ఉంటుందీ చిత్రం. ఆయ‌న డైలాగులు విన్నాక.. చేసే విన్యాసాలు చూశాక బాల‌కృష్ణ మాత్రమే చేయ‌గ‌ల క‌థ అనిపిస్తుంది. జై బాల‌య్య పాట‌లో ఆడిపాడిన తీరు అభిమానుల్ని అల‌రిస్తే, ఆయ‌న చేసిన పోరాటాలు మ‌రో స్థాయిలో ఉంటాయి. బాల‌కృష్ణ రెండు పాత్రల్లో విజృంభించిన‌ప్పటికీ.. ఇందులోని మిగ‌తా పాత్రల‌కి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. క‌థానాయిక ప్రగ్యా జైస్వాల్‌తో పాటు పూర్ణ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు కూడా సినిమాలో కీల‌క‌మైన‌వే. ‘లెజెండ్‌’తో జ‌గ‌ప‌తిబాబుని ప్రతినాయ‌కుడిగా మార్చిన బోయ‌పాటి శ్రీను.. ఈ సినిమాతో శ్రీకాంత్‌ని అలాంటి పాత్రలోనే చూపించారు. వ‌ర‌ద రాజులుగా క్రూర‌మైన పాత్రలో ఆయ‌న క‌నిపిస్తారు.

బాల‌కృష్ణతో తొలిసారి ఎదురుప‌డే స‌న్నివేశం, అఘోరాతో త‌ల‌ప‌డే స‌న్నివేశాలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటాయి. జ‌గ‌ప‌తిబాబు, కాల‌కేయ ప్రభాక‌ర్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. శ‌క్తిస్వరూపానంద స్వామిగా క‌నిపించిన ప్రతినాయ‌కుడు కూడా త‌న‌దైన ప్రభావం చూపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా త‌మ‌న్ సంగీతం సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. అఘోరా నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో నేప‌థ్య సంగీతం కోసం ఆయ‌న ప‌డిన క‌ష్టం తెలుస్తుంది. రామ్‌ప్రసాద్ కెమెరా ప‌నిత‌నం, ఎం.ర‌త్నం మాట‌లు చిత్రానికి ప్రధాన బ‌లాలుగా నిలిచాయి. రామ్‌ల‌క్ష్మణ్‌, స్టంట్‌ శివ పోరాట ఘ‌ట్టాలు మెప్పిస్తాయి. బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీను క‌ల‌యిక ఎందుకు ప్రత్యేక‌మో ఈ సినిమా మ‌రోసారి స్పష్టం చేస్తుంది. మాస్ నాడి బాగా తెలిసిన బోయ‌పాటి త‌నదైన మార్క్‌ని ప్రద‌ర్శిస్తూ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే, భావోద్వేగాలు కూడా బ‌లంగా పండేలా సినిమాని తీర్చిదిద్దారు. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బాలయ్య అభిమానులు ఆయన్నుంచి ఏం ఆశిస్తారో అన్నీ ‘అఖండ’లో ఉన్నాయి.