యోగ చెయ్యండి ..ఆరోగ్యంగా జీవించండి “డాక్టర్ కె.ఎల్ నారాయణ .

నిత్య జీవితంలో యోగా చెయ్యడం వాళ్ళ రోగాలు దరి చేరవని , హాయిగా , ఆరోగ్యంగా జీవించవచ్చునని డాక్టర్ కెఎల్ నారాయణ చెప్పారు . అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు . అధ్యక్షుడు కెఎల్ నారాయణ మాట్లాడుతూ , మానవ జీవితంలో యోగాకి ఎంతో ప్రాధాన్యత ఉందని , అనాదిగా మనిషి జీవితంలో అంతర్భాగంగా ఉందని ఆయన చెప్పారు . భారత దేశం లో ప్రారంభమైన యోగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం మన అందరికీ గర్వ కారణమని ఆయన చెప్పారు .

నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ , తనకి యోగా అన్నా, నడక అన్నా ఎంతో ఇస్తామని చెప్పారు . క్షణం తీరిక లేకుండా గడిపే జీవితంలో లోగా పెద్ద రిలీఫ్ నిస్తుందని చెప్పారు . అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడం ఎంతో సముచితంగా ఉందని చెప్పారు .

మరో నిర్మాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ , యోగాను మించిన ఎక్సర్ సైజు లేదని అన్నారు . రోజులో కనీసం 15 నిమిషాలైనా యోగా చెయ్యడం అవసరమని చెప్పారు .

ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కోశాధికారి తుమ్మల రంగారావు మాట్లాడుతూ , ప్రధాని నరేంద్ర మోడీ , ఉప రాష్ట్రపతి ఎమ్ . వెంకయ్య నాయుడు యోగా ప్రాముఖ్యతను గుర్తించి ప్రచారం చేస్తున్నారని , యోగ మనిషి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుందని అన్నారు .

ఇంకా ఈ కార్యక్రంలో మా అధ్యక్షుడు శివాజీరాజా , నటుడు ఏడిద శ్రీరామ్ , రాజశేఖర్ రెడ్డి ముళ్ళపూడి మోహన్, పెద్దిరాజు, అక్కినేని శైలజ ,భగీరథ , గోరంట్ల సురేష్ , సాంబశివరావు , దర్శకుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు .