ఆరోగ్యం కోసం 20 చిట్కాలు..!

Telugu Box Office

1.నేతిలో వేయించిన వెల్లుల్లిపాయలు ఆహారమునందు ప్రతిదినము నియమపూర్వకంగా తినినచో జీవశక్తి, ఆయుర్దాయము పెరుగుతుంది.
2. ప్రతిరోజూ వామురసము పుచ్చుకొనుచుంటే గుండెనొప్పి ఉండదు.
3.రోజుకు రెండు ఆకుల చొప్పున సరస్వతీ ఆకులు తింటూ ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానిమ్మపండ్ల రసం తీసుకుంటే రక్త వృద్ధి, శుద్ధి అవుతుంది.
4. పెద్ద ఉసిరికాయలు ఎండబెట్టి వరుగులుగా అయిన తరువాత పట్టుతేనెలో నానబెట్టి 6 మాసములు ఊరిన తర్వాత రోజూ 5.ఒకటి తినుచుండిన రక్తపోటు, హృదయకోశ వ్యాధులు దరిచేరవు. ఎంతటివారికైనా మంచి చురుకుదనము వచ్చు.
6.బొల్లి నివారణకు బాదంచాల గింజల గంధము, ప్రతతాళక చూర్ణము కలిపి మచ్చలపై పూయాలి.
7.మునగ ఆకు రసము, మునగ ఆకుతో వండిన వంటకములు తింటే రోగములు రావు.
8.ప్రతిదినము తేనె, అల్లపురసం కలిపి తాగిన రక్తశుద్ధి, మెదడుకు సంబంధించిన వ్యాధులకు నివారణ జరుగుతుంది.
9.తులసిఆకు పసరు, తేనె కలిపి త్రాగిన సర్వ కఫముల రావు.
10.దెబ్బలకు, పైనుండి పడుట వలస కలిగిన నొప్పులకు శిలాజిత్తు పాలతో కలిపి తీసుకోవాలి.
11.గుంటకన్నాకు, మిరియాలు నూరి మాత్రలు చేసి సేవించిన వాతావరణ మార్పులవల్ల వచ్చే జ్వరాలు తగ్గుతాయి.
12.ఆకుకూరలు, అరటిపళ్ళు, బంగాళాదుంపలు, తులసిఆకులు బీపీ తగ్గుతుంది.
13.రాత్రి పడుకోవడానికి ముందు చిమ్మిలి(నువ్వులతో చేసినది) తింటే మలబద్ధకం హరిస్తుంది.
14.అల్లపురసం తాగితే అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. వాటివల్ల వచ్చే తలపోటు తగ్గుతుంది.
15.అన్నం మొదటి ముద్ద వాము వేయించి నేతిలో తింటే ఆకలి పుడుతుంది. అజీర్ణం పోతుంది.
16.గోరుచుట్టుకు పచ్చి పసుపుదుంప మెత్తగా నూరి వేలిపై పూసి మధ్యమధ్యలో తడుపుతూ ఉండే బాధలు తగ్గి నయమగును.
17.అరటిదూట రసం సర్వరోగ నివారిణి.
18.మెంతులు, మెంతికూర ఎక్కువవాడిన చక్కెరవ్యాధి తగ్గును.
19.తెలగపిండి ఆకు రసం రోజూ ఒక తులం సేవిస్తే మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయి.
20.వేడినీటిలో తేనె కలిపి తాగుతూ ఉండే స్థూలకాయం తగ్గుతుంది.
21.కుంకుడుకాయ రసం(నురుగు) వెచ్చచేసి రెండు ముక్కుల్లోనూ వేస్తే పార్శ్వనొప్పి పోతుంది.

Share This Article