భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చే వినాయక చవితి నాడు పూజతో పాటు వ్రత కథకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చవితి రోజున వ్రతకథ వింటే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. కథా ప్రారంభం…తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న ...
Read More »Spiritual
భక్తుల కోర్కెలు తీర్చే దైవం.. అయినవిల్లి సిద్ధి వినాయకుడు
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభనిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా..అంటూ కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే గణనాథుడిని స్తుతిస్తుంది భక్తలోకం. విఘ్నాలు తొలంగించి సకాలంలో పనులు పూర్తయ్యేలా అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక సుప్రసిద్ధ వినాయక ఆలయాలున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లోని అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం ఉన్న పుణ్యక్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 ...
Read More »ఆంధ్రా అయోధ్య.. హనుమంతుడి లేని రామాలయం.. ఒంటిమిట్ట
రామాలయం లేని ఊరూ రామాయణం వినని వారూ మన దేశంలోనూ ఉండరంటారు. ఏ రామాలయానికి వెళ్లినా రాముడి కుడివైపున లక్ష్మణుడు, ఎడమ వైపున సీతాదేవి, పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమంతుడి విగ్రహాలు దర్శనమివ్వడం సాధారణమే. కానీ హనుమంతుడి విగ్రహమే ఉండని రామాలయం మన దగ్గరే ఉందని మీకు తెలుసా.. అలాంటి అరుదైన రామాలయం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్టలో ఉంది. సీతారామలక్ష్మణ విగ్రహాలు ఏకశిలపై దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. ...
Read More »శ్రీరామ నవమి విశిష్ఠత.. ఇలా చేస్తే అన్నీ శుభాలే
హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి ...
Read More »కోరిన కోర్కెలు తీర్చే కంచి కామాక్షి
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న శ్రీ కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. ‘క‘ అంటే సరస్వతి రూపం.. ‘మా’ అనేది లక్ష్మీదేవి రూపం.. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు.. సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తున్నది అని ప్రతీతి. ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్ర నామ జపం ...
Read More »రాఘవేంద్రుడు బృందావనస్థులైన క్షేత్రం.. మంత్రాలయం
భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి వారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. స్థల పురాణం..మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం. మంచాల గ్రామంగా పిలిచే ప్రాంతం ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూల ...
Read More »116 అడుగుల సాయినాథుడు.. ప్రపంచంలోనే అతిపెద్ద బాబా విగ్రహం
సబ్కా మాలిక్ ఏక్ అన్న సందేశంతో యావత్ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్ ప్రసిద్ధ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా షిర్డిలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ప్రపంచంలోనే అతిపెద్ద సాయినాథుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా.. ఇంకెక్కడో కాదు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ సమీపంలోని రేపూరు గ్రామంలో నెలకొల్పిన 116 అడుగుల భారీ సాయిబాబా విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. కాకినాడ ...
Read More »‘ప్లవ’ నామ సంవత్సరం.. ఉగాది రోజు ఇలా చేస్తే అన్నీ శుభాలే!
కొత్త సంవత్సరాది అనగానే లేత మామిడి ఆకుల తోరణాలూ, హాయిగొలిపే కోయిల గానం, జీవిత సారాన్ని తెలియజేసే షడ్రుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం ఇవే గుర్తొస్తాయి. అయితే తెలుగు ఏడాది ప్రారంభం కేవలం వాటితోనే పూర్తికాదు. ఉగాది రోజున చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు. అంటే… యుగ+ఆది అని అర్థం. యుగము అంటే జత అనే అర్థం కూడా వస్తుంది. అలా ...
Read More »భక్తుల కోర్కెలు తీర్చే.. కొండగట్టు అంజన్న
తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయ స్వామికి అనేక ప్రసిద్ధ ఆలయాలున్నాయి. అందులో మొదటిటి కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆలయం. అంజన్న అంటూ భక్తులు భక్తితో కొలిచే ఈ ఆంజనేయుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం. కొండగట్టు పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 35 కి.మీ.లు, వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కి.మీల దూరంలో ఉంది. ఆలయ ప్రాంగణంలో ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు ...
Read More »భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కొలువైన క్షేత్రం.. శ్రీశైలం
మనదేశంలో పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. ‘సౌరాష్ట్రే సోమనాథంచ..’ అని ఆరంభమయ్యే శ్లోకంలో ‘శ్రీశైలే మల్లికార్జునం’ అంటూ భ్రమరాంబికా సతీ హృదయేశ్వరుడి ప్రస్తుతి కనిపిస్తుంది. దేవీ నవరాత్రుల్లో ఆదిపరాశక్తికి నవమరూపంగా భ్రమరాంబను ఆరాధించడం శాక్తేయులకు పరమ పవిత్రం. అరుణుడనే రాక్షసుడు గాయత్రిని విస్మరించిన ఫలితంగా భ్రమర రథాంకృతులతో ఆదిశక్తి అతణ్ణి సంహరించిన గాథ ప్రాచుర్యంలో ఉంది. ఆదిశక్తి కొలువుదీరిన పద్దెనిమిది శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ...
Read More »